పయనించే సూర్యుడు డిసెంబర్ 31 ఆదోని రూరల్ రిపోర్ట్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జన్మదిన పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆదోని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కిమ్స్ ఆస్పత్రి వైద్యులచే క్రాంతి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా దాదాపు 200 మంది దాకా పేదలకు బీపీ,షుగర్,గుండె సంబంధించిన ఈసీజీ,ఎకో పరీక్షలు ఉపయోగపడిందని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని ఉద్దేశంతో బిజెపి ఈ కార్యక్రమం చేపట్టిందని, ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా ఎంతోమంది పేదలకు ఉపయోగపడిందని తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపు సహకరించి కిమ్స్ ఆస్పత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేశాయ్ చంద్రన్న, విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ, ఉపేంద్రకుమార్, నాగరాజు గౌడ్, మునిస్వామి, భాషా, మహదేవ్, సాయి ప్రసాద్ వాల్మీకి, సిల్వరీ రఘు, ఉరుకుందు గౌడ్, కిరణ్, చంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.