
పయనించే సూర్యుడు డిసెంబర్ 31 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి జన్మదిన పురస్కరించుకుని ఆదోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోమాతలకు దానా దానాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఆదోనిలో ఎవరి జన్మదినం ఉన్న సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి గో సేవా చెయ్యాలని పిలుపునిచ్చారు. గోమాతకు సేవ చేయడం ద్వారా మనకు మానసికంగా, మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని బిజెపి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు దేవరాజ్ ధోకా దీపక్ ధోకా బిజెపి నాయకులు దేశాయ్ చంద్రన్న, కునిగిరి నీలకంఠ, ఉపేంద్రకుమార్, నాగరాజు గౌడ్ , కౌన్సిలర్ల లితమ్మ, సురేష్, తాయప్ప వాల్మీకి, మధుసూదన్ శర్మ, సాయి ప్రసాద్ వాల్మీకి, చంద్ర, వేణుగోపాల్, మహదేవ్, కాశీ, కిరణ్, ఉషా రాజ్ తదితరులు పాల్గొన్నారు.