పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ డిసెంబర్ 31 : డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని., వాహనానికి, నడిపే వ్యక్తికి డాడీస్ రోడ్ స్టిక్కర్ భద్రత ఇస్తుందని రాజంపేట నియోజకవర్గ డిస్ట్రిబ్యూటర్ గౌనిపురం పెంచల్ రాజు అన్నారు. మంగళవారం ఆయన రాజంపేటలో యాప్ స్టిక్కర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉరుకులు, పరుగులు జీవితంలో అకస్మాత్తుగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు క్యూఆర్ కోడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజలందరూ ఈ యాప్ ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. డాడీస్ రోడ్డు యాప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ యాప్ స్టిక్కర్ ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. వాహనాలకు "డాడీస్ రోడ్ యాప్" క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక లాంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే "డాడీస్ రోడ్ యాప్" ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగ పడుతుందని, ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరం, వైద్య సేవలు, వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసినా.. అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు. అనుకోని ప్రమాదాల బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ యాప్ క్యూఆర్ స్టిక్కర్ చాలా అవసరమని అన్నారు. ప్రతీ వాహనదారునికి దాడీస్ రోడ్ క్యూ ఆర్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ వాహనాలు కలిగిన ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా డాడీస్ రోడ్ క్యూ అర్ స్టిక్కర్ ను వినియోగించుకోవాలని కోరారు.