కోట్ర గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

★ కోట్ర గ్రామ సర్పంచ్ షాంపూరి శారద చెన్నయ్య

పయనించే సూర్యుడు, డిసెంబర్ 31 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలోని కోట్ర గ్రామంలో పలు అభివృద్ధి పనులకు పిఆర్ఏఈ సురేందర్ రెడ్డితో కలసి గ్రామ సర్పంచ్ షాంపురి శారద చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రతిపాదనని సిద్ధం చేశారు. మంగళవారం ప్రధానంగా కోట్ర గ్రామంలో డబుల్ లైన్ సిసి రోడ్డు నిర్మాణానికి, గ్రామంలో మిగిలి పోయిన సిసి రోడ్ల నిర్మాణానికి, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి, వెల్దండ కోట్ర మట్టి రోడ్డు నిర్మాణానికి అధికారులతో కలిసి కొలతల ప్రకారం ప్రతిపాదనను తయారు చేశారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు సత్యం, మల్లేష్ , ఉపాధ్యాయులు చెన్నకేశవులు, నాయకులు మల్లయ్య, సందీప్, వెంకటయ్య, రాజు యాదవ్, హరి ప్రసాద్, శివ, సోనూ, కైఫ్ తదితరులు పాల్గొన్నారు.