గంజహళ్లి ప్రధాన రహదారి అస్థవ్యస్థం చలనం లేని అధికారులు ఖాసింవలి

* డ్రైనేజీ ఏర్పాటు చేయడంలో మేజర్ గ్రామ పంచాయతీ అధికారుల విఫలం * రోడ్డు వేసి డ్రైనేజీ ఎర్పాటు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాశీం వలి డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు మండల కేంద్రంలోని గంజహళ్లి ప్రధాన రహదారి లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి డ్రైనేజీ నీరు గుంతల్లో నిలిచి రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రమాదాల భారిన పడుతున్న అధికారుల్లో మాత్రం చలనం లేదని గోనెగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖాసిం వలి ఆవేదన వ్యక్తం చేశారు, మంగళవారం రోజు స్థానికుల సమాచారం మేరకు గుంతలు ఏర్పడిన రహదారిను పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా గుంతల్లో మురికి నీరు నిల్వ ఉండటం వలన రాత్రి వేళల్లో గంజహళ్లి గ్రామానికి చెందిన వాహన దారులు భయం గుప్పిట్లో ప్రయాణం చేసే పరిస్థితి దాపురించిందన్నారు, రెండు నెలల్లో గ్రామంలో జరిగే మహాత్మా బడేసాహెబ్ ఉరుసు ఉత్సవాలకు, మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎందరో మొక్కులు తీర్చుకోవడానికి రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణం చేస్తారని , గ్రామ ఉరుసుకు వేల సంఖ్యలో ట్రాక్టర్లు, బస్సులు,ద్విచక్ర వాహనాల ద్వారా వేల సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని, ఈ రహదారి దుస్థితి వలన వెళ్ళలేని పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ ఏర్పాటు చేయడంలో పంచాయితీ అధికారులు విఫలం కావడంతోనే రోడ్డు మీదకు మురికి నీరు చేరి గుంతలు ఏర్పడి రహదారి పరిస్థితి దయనీయంగా మారిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును వేసి డ్రైనేజీ ఎర్పాటు చేయాలని లేనిపక్షంలో స్థానిక ప్రజలు గ్రామస్థులతో కలిసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు,శేషాద్రి, ముస్తఫా,డి. మాబు, కడివెళ్ళ హాజీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *