ఘనంగా మల్లంపేటలో వైకుంఠ ఏకాదశి

పయనించే సూర్యుడు డిసెంబర్ 30, పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి పర్వ దినాన్ని పురస్కరించుకొని మల్లంపేటలో హరి హర క్షేత్రంలో కొలువైన శ్రీ సీతా రామ చంద్రస్వామి లక్ష్మణ సహిత హనుమాన్, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, హనుమాన్, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి నవగ్రహ దేవత మూర్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివ శ్రీ శివ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు శివ శ్రీ మడుపతి ప్రభులింగం, మణికంఠ స్వామి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గం//లకు ప్ర ప్రథమంగా మహా గణపతి పూజ పంచామృత అభిషేకం అలంకరణ చేసి ప్రధాన మూర్తులైన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమాన్, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వార్లకు రుద్ర పురుషసూక్త, శ్రీ సూక్త విధానేన పంచామృత, ఫలోదక, హరిద్రా, కుంకుమ అభిషేకం నిర్వహించి అలంకరణ చేసి ఆంజనేయ స్వామి వారికి చందన సమర్పణ చేసి మహా నైవేద్యం సమర్పించి మహా మంగళ హారతి ఇవ్వడం జరిగింది. తరువాత ఉత్తర ద్వార పాలక పూజ అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వారంగుండా భక్తులు దర్శించుకున్నారు. తరువాత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల మాజీ మండల అధ్యక్షులు చందన ప్రశాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పుట్టి పద్మ రమేష్, గ్రామ పెద్దలు బాపురెడ్డి, మోహన్ రెడ్డి, రాంరెడ్డి, లచ్చిరెడ్డి, చంద్రయ్య, లక్ష్మగౌడ్, చెన్నగౌడ్,కృష్ణమూర్తి, కందిపల్లి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు దుర్గపతి, శ్రీనివాస్, పాల్గొన్నారు.