జనవరి 2న,ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంక్ నందు 2026 జనవరి 2న, ఉదయం 10 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రతినెల ప్రసవాలకు వచ్చిన గర్భవతులకు, ఆర్థోపెడిక్ సర్జరీ రోగులకు, సాధారణ సర్జరీ రోగులకు, రక్తహీనత గల రోగులకు 200 బ్లడ్ యూనిట్లో అవసరం ఉంటుందని, నాగర్ కర్నూలు జిల్లాలోని యువత, మరియు రక్త దాతలు స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొని ఒక యూనిట్ రక్తాన్ని అందజేయాలని ఆయన కోరారు.రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగాసర్టిఫికెట్, పండ్లు,జ్యూస్ అందజేస్తారని తెలిపారు. గతంలో రక్తం ఇచ్చినవారు కూడా ఈ శిబిరంలో రక్తదానం చేయవచ్చునని తెలిపారు. శిబిరానికి జిల్లాలోని యువత ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల వారు మహిళా సంఘాల వారు పాల్గొని సహకరించాలని కోరారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి సెల్ నెంబర్ 9014932408 సంప్రదించాలన్నారు.