పయనించే సూర్యుడు డిసెంబర్ 31 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ కార్యదర్శి కామ్రేడ్ టి. వీరేష్ నాయకత్వంలో నేడు స్థానిక బీమస్ మీటింగ్ హాల్ నందు పార్టీ పట్టణ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, వివిధ ప్రజాసంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ జి. అంజిత్ గౌడ్ గారు అధ్యక్షత వహించగా, పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బసాపురం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శిలు లక్ష్మీనారాయణ కే రమేష్ కుమార్ శాఖా కార్యదర్శులు ఎ.విజయ్ కుమార్ సి ఆర్ నగర్ సహాయ కార్యదర్శి.కే.లింగప్ప ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ దస్తగిరి ఆటో యూనియన్ నాయకులు బి చిట్టిబాబు ఈ రామకృష్ణ రవికుమార్ రమేష్ ఈ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వసంతాల వేడుకలను 2026 జనవరి 9వ తేదీన ఘనంగా నిర్వహించాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 1925లో ఆవిర్భవించిన సిపిఐ వంద సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, యువత హక్కుల పరిరక్షణకై రాజీలేని పోరాటాలు చేస్తూ సమ సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు సాగిన పార్టీగా నిలిచిందని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూసంస్కరణలు, కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, ప్రజాస్వామ్య హక్కులు, లౌకికత పరిరక్షణ, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరంతరం ఎదురొడ్డి పోరాడుతున్న పార్టీ సిపిఐ మాత్రమేనని సమావేశం స్పష్టం చేసింది.శత జయంతి వేడుకలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సమావేశాలు, సభలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ చరిత్రను నూతన తరానికి చేరవేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల్లో అన్ని ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలు చురుకుగా పాల్గొని శత జయంతి వేడుకలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో పార్టీ మరాఠీ గేరి నాగరాజ్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.