జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో కారుకొండ పాఠశాల కు మొదటి బహుమతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు రోజులుగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రాథమికోన్నత పాఠశాల కారుకొండ విద్యార్థి డి.వైష్ణవి ఆరవ తరగతి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి (నిలువ వ్యవసాయ పద్ధతి) అనే అంశంలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు ఎన్నిక కావడం జరిగింది. అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో 3వ బహుమతి ఎం. నిహారిక 7వ తరగతి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు గారిచే బహుమతులు అందుకోవడం జరిగింది, కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు రామకృష్ణ ,భాగ్యలక్మి, శ్రీకాంత్, ఇంద్రాణి, లావణ్య, భారతి,చెన్నమ్మ అభినందించారు.