జై చిరంజీవా నామదేయుడుగాండ్ల పల్లె శ్రీ శ్రీ శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి శుభ మంగళవారం సందర్భంగా విశేష పూజలు

*జె. హరినాథ్ (టీచర్) ఆయన సతీమణి సరస్వతమ్మ మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేషపూజలు * ఈ పండుగ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గాండ్లపల్లె ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో తుల తూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్నను వేడుకున్నారు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 31.12..2025 (చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడే పల్లె మండల ప్రతినిధిJ. నాగరాజ) చౌడేపల్లె మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్ల పల్లె గ్రామంలో వెలసివున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే100 సంవత్సరాలచరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి శుభ మంగళవారం సందర్భంగా విశేషపూజలు సరస్వతమ్మ హరినాథ్ (టీచర్) గాండ్ల పల్లె వాసి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోవిశేష పూజలు నిర్వహించారు ఆలయం లోపలనీటితో శుద్ధపరిచి గడపలకు గుమ్మాలకు పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టి స్వామి వారి విగ్రహాన్ని నీటితో శుద్ధపరిచి పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి ప్రత్యేకమైన రంగు రంగులపూలతో అలంకరించి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో పూజించారు పాలు పెరుగు నెయ్యి ఆపిల్ పండ్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు ద్రాక్ష పండ్లు మిశ్రమంతో పంచామృతం చేసి దేవదేవునికి నైవేద్యంగా పెట్టి అభిషేకము వస్త్రాలంకరణ అష్టోత్రము ఆకు పూజ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ భుజంగ స్తోత్రం వంటి వి పారాయణం చేసిప్రత్యేక పూజలు నిర్వహించారు దేవునికి నెయ్యి దీపాలు వెలిగించి అగరవత్తులు వెలిగించితమల పాకులతో ఆకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకుల దండ సింధూరం సమర్పించిన భక్తులకు ఎలాంటి కష్టాలు దరిచేరవు అని భక్తుల విశ్వాసం అలాంటి స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారు భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ గోవింద నామస్మరణలతో ఆలయంలోపల భక్తుల నినాదాలతో ఆలయం కిటకిటలాడింది ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గాండ్లపల్లె ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్నను వేడుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *