డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన జి.యం.లు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీకాలనీ-31: డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మంగళ వారం స్థానిక రామగిరి అతిథి గృహం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు. రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ఆర్.జి-3 ఏరియాకు నిర్దేశించిన 6.00 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 4.34 లక్షల టన్నులు అనగా 72 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 60.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి)వెలికితీత లక్ష్యానికి గాను, 32.59 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 54 శాతం ఓ.బి(మట్టి) వెలికి తీయడం జరిగిందని, అదేవిధంగా 5.20 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. తదుపరి గనులవారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ డిసెంబర్ నెలలో ఓ.సి.పి-1 గనికి నిర్దేశించిన 3.20 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.27 లక్షల టన్నులు అనగా 40 శాతం, ఓ.సి.పి-2 గనికి నిర్దేశించిన 2.80 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.07 లక్షల టన్నులు అనగా 110 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే డిపార్ట్మెంట్ ఓబి వెలికితీత లో ఓసి-1, 5.00 లక్షల క్యూబిక్ మీటర్ల లకు గాను 6.32 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించి 126 శాతం సాధించిందని, ఓసి-2 , 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల లకు గాను 7.60 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించి 101 శాతం సాధించిందని అన్నారు. అలాగే అందరి సహకారంతో రెండున్నర సంవత్సరాలు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించానని, అందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కి డిసెంబర్ నెలలోనిర్దేశించిన 1.65 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.18 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. నూతన ప్యానల్ పనులను త్వరలో పూర్తి అవుతాయని, బాధ్యతాయుతంగా నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించాలని, ఉద్యోగులు గైర్హాజరు కాకుండా విధులు నిర్వహించాలని అన్నారు.కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ వి.వి.సుధాకర్ రెడ్డి, ఎస్వోటు జిఎం బండి సత్య నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ప్రవీణ్ వి ఫాంటింగ్, జె.రాజశేఖర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి.శంకర్, ఐఈ డిజియం బి.టి.మురళి కృష్ణ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డిపియం వి.సునీల్ ప్రసాద్, సీనియర్ పిఓ పి.రాజేశం తదితరులు పాల్గొన్నారు.