పయనించే సూర్యుడు: డిసెంబర్ 31: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న మాజీ టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాధున్నీ కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.