పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ హయాంలో పచ్చని పంట పొలాలతో పచ్చగా ఉండేవి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో సమయానికి కరెంటు లేక రైతులకు యూరియా సమయానికి సరిపోను అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క పని కూడా చేయకపోవడం విడ్డూరమని ప్రభుత్వంపై మండిపడ్డారు. కృష్ణ గోదావరి నీటి జలాల వాటాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆంద్రాకు వత్తాసు పలుకుతు న్నారని, కృష్ణా బేసిన్ లో ఉన్న నీటిని సాగుకు అందించాలని కోరారు. తెలంగాణ వాటాలో 90 టీఎంసీల ఉన్న నీటిలో, నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీల నీరు చాలని కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని, కేంద్రం నుండి డిపిఆర్ తిరిగి వచ్చింది. ఈ అసమర్థత ప్రభుత్వం వలన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మేక రాయడం వలన నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి కి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని అర్థమవుతుందని తెలిపారు. దేవరకొండ మునుగోడు ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కేంద్రం పంపిన డీపిఆర్ లో తిరిగి పంపాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇద్దరు కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరమోని శ్రీనివాస్ ఈశ్వరయ్య ,రషీద్ ,బల్ముల తిరుపతయ్య పీర్ మహ్మద్ రామస్వామి భాస్కర్ ప్రమీల మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.