నూతన సంవత్సర వేడుకలకు దూరం ముదునూరి మురళి కృష్ణం రాజు

★ అభిమానులు, దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి,

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,డిసెంబర్, 31: ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ నాయకులు ధర్మవరం గ్రామ పెద్దలు వైసీపీ శ్రేణులు చే అభిమానించ బడుచున్న వై. యస్. ఆర్. సి. పి నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మదునూరు మురళి కృష్ణంరాజు ఈ నూతన సంవత్సర వేడుకలకు అభిమానులకు అందుబాటులో ఉండలేక పొవడాన్ని నియోజకవర్గ ప్రజానీకం అర్థం చేసుకుంటారని కొన్ని అనివార్య కారణాలవల్ల నియోజకవర్గం లో ఉండడానికి వీలుపడలేదని, నూతన సంవత్సరం అభిమానులు, నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలంతా ఆనందంగా జరుపుకొని సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని అందరూ గమనించి దూర ప్రాంతాల నుండి ఏ ఒక్కరూ వచ్చే ప్రయత్నం చేస్తూ తమ ధనాన్ని విలువైన సమయాన్ని వృధా చేయకుండా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.