నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు విధించిన కాశీబుగ్గ పోలీసులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. 2025 డిసెంబర్ 31 రాత్రి జరుపుకోబోయే నూతన సంవత్సర వేడుకలకు కాశీబుగ్గ సిఐ ఏ రామకృష్ణ పలాస కాసేబుగ్గ మున్సిపాలిటీ, పలాస మండల ప్రజలకు కొన్ని నిబంధనలతో జరుపుకోవాలని కోరారు. వీధుల్లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాలన్న, ముందుగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని, డీజే సౌండ్ సిస్టం వీధుల్లో ఏర్పాటు చేయాలన్న పోలీసు అనుమతి తప్పని సరి ఆయన తెలిపారు. కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, నిర్వహించిన ఆర్గనైజర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వేడుకలకు రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, తరువాత కార్యక్రమాలను ఆపివేయాలని తెలిపారు మద్యం త్రాగి రోడ్డుపై తిరిగిన వారికి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం త్రాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సి ఐ కోరారు.