పలాస కాశిబుగ్గ జంట పట్టణాలలో వ్యాపారాలకు అనుకూలం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడు పెట్రోల్ బంక్ ప్రక్కన నూతనంగా నిర్మించిన ఎస్ ఎస్ ఎస్ ఫార్చ్యూన్ కన్వెన్షన్ హాల్ ను మంగళవారం పలాస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ శరవేగముగా అభివృద్ధి చెందుతుందని, వైద్య విద్య రంగాలతోపాటు వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంథాలయ చైర్మన్ పీరకట్ల విఠల్ మల్ల శ్రీనివాసరావు, గాలి కృష్ణారావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.