పయనించే సూర్యుడు డిసెంబర్ 31, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీ చర్చి ఎదుట పొట్ట లావణ్య ఇంటి పరిధిలో ఉన్నటువంటి స్థలంలో గత రెండు నెలలుగా వాటర్ పైపు పగిలి నీటి లీకేజీ జరుగుతుండగా, గ్రామపంచాయతీ ఏర్పడిన వెంటనే దీనిపై స్పందించిన గ్రామ సర్పంచ్ లక్ష్మీ అచ్చయ్య తక్షణమే రిపేర్ పనులు చేపట్టించారు. ఈ మరమ్మత్తుల వల్ల ఆ ప్రాంతంలో నీటి వృధా నిలిచిపోయి, స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్షణ సమస్యలకు పరిష్కారం చూపుతున్న గ్రామపంచాయతీ పాలనపై హర్షం వ్యక్తం అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, ఉపసర్పంచ్ దారిల్లి సురేష్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
