పయనించే సూర్యుడు డిసెంబర్ 31, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా 56 లక్షల రూపాయలతో అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని రోడ్లు ట్రైన్లు ఇప్పటికే నిర్మించామని అలాగే వారికి ఏ కావలసిన పనైనా వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, టిడిపి నాయకులు పెంకె బాబా, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఎండిఓ సతీష్ పంచాయతీ కార్యదర్శి బేగం, ఉప సర్పంచ్ పెంకే సోమరాజు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.