ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదు

★ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ఉప సర్పంచ్ గురిజల బుచ్చిరెడ్డి

పయనించే సూర్యుడు 31-12-2025 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదని జగిత్యాల - ధర్మారం రోడ్డు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కూడలి దగ్గర, వెనుకమట్ల రోడ్డు దగ్గర, నల్లగుట్ట దగ్గర గల దెబ్బతిన్న రోడ్డును వెంటనే మరమ్మతులు చెయ్యాలని ఎఈ అర్ ఎన్ బి అధికారిని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది వారు వెంటనే స్పందిస్తూ వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ నల్ల నీరజ రెడ్డి, ఉప సర్పంచ్ గురిజల బుచ్చిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.