పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 బోధన్ పట్టణంలో, వైకుంఠ ఏకాదశి వేడుకలను కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజున ఉదయం నుండి పట్టణంలోని మండలాల్లో భక్తులు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ లక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో గల బాలాజీ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులతో విరజిల్లాయి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం స్వామి వారిని దర్శించుకుని ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. భజనలు, కీర్తనలు పాడారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు పలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం బోధన్ పట్టణంలోని ఆయా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ ప్రతినిధులు రవికిరణ్, హరికాంత్ చారి తదితరులు, భక్తులు, మహిళలు ఉన్నారు.