బోధన్ పట్టణంలో వాహనాల ప్రత్యేక తనిఖీలు

★ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు ★ నూతన సంవత్సరం వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ★ పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 బోధన్ పట్టణంలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్ సీపీ అదేశాల ప్రకారం బుధవారం పట్టణంలో వాహనాల ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పట్టణ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగంతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారకులు కాకూడదన్నారు. నూతన సంవత్సర వేడుకలపై విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్, రోడ్లపై గస్తీ చెకింగ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ముందుగా పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.