
పయనించే సూర్యుడు డిసెంబర్ 31, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) దేశంలో 108 వైష్ణ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన సర్పవరంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ప్రచురించుకునే భక్తులు వేలాదిగా తరలిరావడం జరిగింది. మంగళవారం తెల్లవారుజామునుండే భావనారాయణ దర్శించుకునేందుకు భక్తులు ఉత్తర ద్వారం వద్ద పోటెత్తారు. వైకుంఠంలో విష్ణుమూర్తి ముక్కోటి రోజున దేవతలకు దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం దానిని దృష్టిలో ఉంచుకుని దేశంలో వైష్ణవు దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు దీంతో జిల్లా నలుమూల నుండి భక్తులు స్వామిని దర్శించేందుకు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలను చేపట్టారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టిక్కెట్లు అమ్మకాలు నిర్వహించారు అదేవిధంగా ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. సుమారు 20 వేలమంది భక్తులు తరలి రావడం జరిగింది. ప్రత్యేక అధికారిగా వీరభద్రరావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా పరిశీలించారు. ఎలా ఉండగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించడం విశేషం. ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎటువంటి తొక్కేసలాట గొడవలో జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు.