పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ డిసెంబర్ 31 : మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో మంగళవారం మండల సర్వేయర్ వెంకటసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి కే.శ్రీధర్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ గ్రామ సరిహద్దులపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్లాక్ బౌండరీలు, రైతులకు నోటీసులు జారీ చేయుట గురించి, రీ సర్వే ప్రక్రియ తదితర అంశాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఊటుకూరు పరిధిలో రిసర్వేపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శివరాజ, సర్వేయర్ సాయి హేమ, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.