రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాల నివారించవచ్చు

* జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)ప్రాణాలు అతి ముఖ్యమని.రోడ్ భద్రత నియమాలనుపాటిస్తేప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్అన్నారు స్థానిక ఎన్ ఎం ఆర్ గార్డెన్ లో మంగళవారం రోడ్ భద్రత, ప్రమాద నివారణ ల పైన ఆర్టిఏ మెంబెర్ అభి గౌడ్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ముఖ్య అతిది గా హాజరయ్యారు ఈసందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ భౌగోళికంగా జిల్లా లో నేషనల్ హై వే, ప్రధాన రహదారులు ఎక్కువ విస్తీర్ణం తో ఉన్నాయని వాహనదారులు ట్రాఫిక్ నిబంధన లను తప్పకుండ పాటించాలన్నారుమితిమీరిన వేగం తోప్రమాదం బారిన పడ్డ వ్యక్తి వల్ల వారి కుటుంబ సభ్యులు ఆర్ధికంగా, మానసికం గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలిసి వస్తుందన్నారురోడ్ భద్రత నియమాలు తప్పనిసరి అని నిర్లక్ష్యం చేయకూడదని ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధన లని తెలిసి ఉండాలని వాటిని అందరూ పాటించాలన్నారు లైసెన్స్, ఇన్సూరెన్స్ ను తప్పకుండ కలిగి ఉండాలని, హెల్మెట్ ని ధరించాలన్నారు సెల్ మాట్లాడుకుంటూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని అలాగే మితిమీరిన వేగం తో వాహనాలని నడపవద్దని కలెక్టర్ సూ చించారు ఎవరైనా డ్రగ్స్తీసుకుంటున్నట్టు గమనిస్తేవెంటనే తమకు సమాచారం ఇస్తే వారికి 10,000 రూపాయల రివార్డ్ ఇస్తామన్నారు ఈ కార్యక్రమం లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఆర్టిఏ మెంబెర్ అభి గౌడ్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *