పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఎమ్మిగనూరు పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీ తిరుమల వెంకట సాయి దేవాలయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సందర్శించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దేవుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ , పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటైన ఎమ్మిగనూరు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, టిప్పర్ యజమానులు ఐక్యంగా పనిచేస్తూ, రవాణా రంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు. అలాగే, కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపులో అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, పాల్గొన్నారు.