
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 31 జగయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలోని ఈ రోజున పావన కృష్ణానది తీరమున పంచనారసింహ క్షేత్రమైన ఎన్.టి.ఆర్.జిల్లా, జగ్గయ్యపేట మండలం, వేదాద్రి గ్రామములో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము నందు ది.30-12-2025 న పర్వదినమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ వారు శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తముగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్ధ, ప్రసాదములు స్వీకరించారు. ఉత్తర ద్వార దర్శన అనంతరం శ్రీ స్వామి వారికి గరుడ వాహన సేవ మరియు అమ్మవార్లకు పల్లకి సేవలు జరిపించడమైనది. ఈ కార్యక్రమములో దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్తు తరుపున కె.సి.పి. రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. దేవాలయమునకు విచ్చేసిన భక్తులందరికీ దాతల సహకారంతో ఉచిత ప్రసాదములు మరియు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం జరిగినది, అదేవిధముగా కొండపై నెలకొనియున్న శ్రీ స్వయంభూ జ్వాల నరసింహ స్వామి వారి సన్నిధిలో “శ్రీ నృసింహ నామ సంకీర్తన” ఏకహా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు పర్యవేక్షణలో శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనమునకు పై ఏర్పాట్లన్ని చేసినారని తెలియజేయడమైనది.

