వైకుంఠ వాసుని ఉత్తరద్వార దర్శనము అత్యంత వైభవంగా జరిగింది

పయనించే సూర్యుడు తేదీ: బుధవారం డిసెంబర్ 31, 2025 గాజులరామారం రిపోర్టర్ ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా) కుత్బుల్లాపూర్, పద్మనగర్ లో ఉన్నటువంటి కళ్యాణ తిరుపతి దేవాలయంలో మూడవ అంతస్తు పైన వైకుంఠ వాసుని ఉత్తరద్వార దర్శనము. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు.. ఓం నమో వేంకటేశాయనమః 30-12-2025 మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఉదయము 04-30 గంటలకు ఉత్తరద్వార దర్శనము ప్రారంభం.. అంతకంటే ముందు 03-30 గంటలకు తిరుప్పావై సేవాకాలము నిర్వహించ బడింది.. భక్తులందరూ అధికసంఖ్యలో స్వామివారిని ఉత్తర ముఖ ద్వారము ద్వారా దర్శిచి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చారు.