శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు: కంటేస్టెడ్ ఎమ్మెల్యే, రవికుమార్ యాదవ్

పయనించే సూర్యుడు, డిసెంబర్ 31 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజ న్,చంద్ర నాయక్ తాండా, కొండాపూర్ గ్రామం లలోనీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందిన బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం అందరి జీవితాలలో శాంతి, సుఖసమృద్ధులు నింపాలని ఆకాంక్షిస్తు న్నానన్నారు, నియోజకవర్గ ప్రజలంద రికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ పవిత్ర దినాన శ్రీ మహావిష్ణువు కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని, వైకుంఠ ద్వార దర్శనంతో పాపాలు నశించి,పుణ్య ఫలాలు కలగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు ప్రతి ఒక్కరికీ కలగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమలలో సీనియర్ నాయకులు నరసింహ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ఉట్ల కృష్ణ, దశరథ్, పవన్, శ్రీహరి, మాదాపూర్ డివిజన్ కంటెస్టేడ్ కార్పోరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కంటేస్టేడ్ కార్పొ రేటర్ ఎల్లేష్, మహేందర్, శ్రీను నాయక్, కిరణ్, శ్రీకాంత్ యాదవ్, ఆలయకమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.