శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా ముక్కోటి పూజలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరం గ్రామం పూల మార్కెట్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కొండబాబు శర్మ వారిచే ఆంజనేయ స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకాలు , లక్ష తమలపాకులతో స్వామివారిని అభిషేకించి సింధూరం పూజలు చేశారు. అనంతరం సీతారామ భజన సమాజం వారిచే నిర్వహించిన ఏకాహం భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో రెడ్డి సత్యానందం, ఏసు, పూల వర్తక వ్యాపార సంఘం సభ్యులు, మానేపల్లి ప్రసాద్,పుల్ల రామకృష్ణ,వెన్నపు స్వామితదితరులు పాల్గొన్నారు.