షార్ట్ ఫిలిం ప్రోమో ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,మంథని విద్యార్థి యువత కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు కొండెల మారుతి అధ్యర్యంలో 31డిసెంబర్ (జీరో డే )దావత్ లను నివారించే ఉద్దేశంతో తీసిన షార్ట్ ఫిల్మ్ ను ప్రోమో ను మంగళవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ 31డిసెంబర్ రోజున సమాజం లోని యువత పార్టీలని దావత్ లని అధిక ఖర్చు తో జల్సాలు చేస్తున్నారు అలాంటి జల్సాలు దావత్ లు చేసుకోకుండా ఏదైనా ఒక మంచి పనికి ఆ ఖర్చు ను ఉపయోగించాలనే ఆలోచతో తీసిన షార్ట్ ఫిల్మ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నారమల్ల కృష్ణ, కెమెరామెన్, ప్రొడ్యూసర్ చరణ్ రాజ్ (ఛిన్న ) నటినటులు శ్రీనివాస్ గౌడ్, పుప్పాల సతీష్, విజయ్ భాస్కర్, బొమ్మకంటి మల్లేష్, ఆకుల అజయ్, కరుణాకర్, రమేష్ పాల్గొన్నారు