సాలూర మండల ఎంపీడీవో తాహాసిల్దార్ ను సన్మానించిన నూతన సర్పంచులు

★ సన్మానించిన కుమ్మన్ పల్లి ఖాజాపూర్ మందర్న సర్పంచులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 బోధన్: సాలూర మండలం మందర్న కుమ్మన్ పల్లి ఖాజాపూర్ గ్రామ నూతన సర్పంచ్ రావుబా సావిత్ర గంగాధర్, చింతం నాగయ్య, శీలం మహేందర్ రెడ్డి, సాలురా ఎంపీడీవో శ్రీనివాస్ మరియు మండల తహసిల్దార్ శశిభూషణ్ లను మంగళవారం మర్యాదపూర్వకంగా సర్పంచులు ఎంపీడీవో తాసిల్దార్ ను కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా సాలుర మండల ఎంపీడీవో శ్రీనివాస్ తాసిల్దార్ శశిభూషణ్ వారిని అభినందించి సాలూర మండల ప్రజలతో పాటు వాళ్ల వంతుగా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని సూచించారు.గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉండాలన్నారు.ప్రజలకు ఉత్తమ సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు.