పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక 2023-24 ద్వైవార్షిక పురస్కారాలు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని జన్మస్థలమైన జనగామ జిల్లా పాలకుర్తిలోని సిద్ధార్థ విద్యాలయంలో 2025 డిసెంబర్ 31 బుధవారం నాడు ఉదయం గం. 10.30 లకు ప్రదానం చేయనున్నట్లు పీఠం అధ్యక్ష కార్యదర్శులు డా. రాపోలు సత్యనారాయణ, ఇమ్మడి దామోదర్ ఒక ప్రకటనలో తెలినారు సోమనాథ సాహిత్య పురస్కారం ను డా. దివాకర్ల రాజేశ్వరి (బెంగళూరు), సోమనాథ సామాజిక శోధన పురస్కారంను డా. పండితారాధ్యుల సీత (ద్వారకా తిరుమల, ఏలూరు జిల్లా), సోమనాథ రంగస్థల పురస్కారంను మోహన్ సేనాపతి (హైదరాబాద్), "పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవ పురస్కారంను కోడిహళ్లి మురళీ మోహన్ (అనంతపురము జిల్లా), వి చలపతి రావు సాహిత్య పురస్కారం ను డా. చెన్నమనేని పద్మ (బోర్నపల్లి, జగిత్యాల జిల్లా), బండారు తమ్మయ్య సాహిత్య పురస్కారంను డా. దామెర వెంకట సూర్యా రావు (విశాఖపట్టణం), డా. రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారం" ను బొడిగె సూర్య ప్రకాశ్ (లక్ష్మినారాయణ పురం, పాలకుర్తి మండలం), దేవగిరి రాజయ్య స్మారక పద్య ప్రవాహ" బిరుదును డా. కె. బాలస్వామి (మరికల్, నారాయణపేట జిల్లా) లకు అందజేయనున్నట్లు వారు స్పష్టం చేసిండ్రు. అదే విధంగా డా. సత్తెనపల్లి బాబు వ్రాసిన శైవ సాహిత్యం - సామాజిక దృక్పథం, డా. కె. బాలస్వామి రచించిన ఓం నమః శివాయ గ్రంథాల ఆవిష్కరణ జరుగగలదని వివరించినారు సాహిత్యాభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరనారు