పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మధ్యాహ్నం పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని కొప్పురు సర్పంచ్ గద్ద కుమారస్వామి, భీమదేవరపల్లి తహసిల్దార్ రాజేష్, బుధవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో భోజనం నాణ్యత, పరిశుభ్రత, రోజువారి మెనూ అమలు, తదితర అంశాలను పరిశీలించారు.. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అంగన్వాడి సిబ్బందికి సూచించారు.. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీధర్ వున్నారు..