అధికార పార్టీ అండతో అక్రమ కేసులు బనాయించడం పద్ధతి కాదు

★ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

పయనించే సూర్యుడు01-01-2026 రిపోర్టర్ రమేష్ నాయక్ నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం పోలీసుల చిట్టా అంతా నా దగ్గర ఉందివారం రోజుల్లో మీ పని పడతాంనర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డిచెన్నారావుపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే, చెన్నారావుపేట పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారుకాంగ్రెస్ పాలనలో యూరియా కోసం మహిళలు, వృద్ధులు పిల్లలను ఎత్తుకొని రాత్రి 12 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎముకలు కోరికే చలిలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, రైతుల పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుందని మండిపడ్డారుచలిమంట కాగే నిప్పు కర్రలతో మా బీఆర్ఎస్ కార్యకర్తలపై చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేసిన కూడా పోలీసులు పూర్తి విచారణ చేయకుండానే తిరిగి మా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. చెన్నారావుపేటలో బిఆర్ఎస్ వార్డు సభ్యుడి పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తల పగులగొట్టిన పోలీస్ స్టేషన్ లో బాధిత వార్డు సభ్యుడు ఫిర్యాదు చేసిన వార్డు సభ్యుడి పైనే కేసు నమోదు చేసిన ఘనులు. ఏకపక్షంగా ఉండి చట్టరిత్యా న్యాయం చేయని పోలీసు అధికారుల సంగతి వారం రోజుల్లో చూడడం జరుగుతుందని ఘాటుగా సమాధానం ఇచ్చారుబిఆర్ఎస్ కార్యకర్తల ఫోను ఎత్తరంట పోలీసు వారు… చెన్నారావుపేట పోలీసు వారు ఏం చేస్తున్నారుఎక్కడెక్కడ ఎంత తిన్నారు అనేది మా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి… గూగుల్ పే ఫోన్ పే ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర ప్రతిదీ తేట తెల్లం చేస్తూ చట్టరీత్య వారం లోపే మీ సంగతి చూడడం జరుగుతుందని పోలీసు వారిని హెచ్చరించారుఅంతేకాక ఎస్సీ ఎస్టీ కమిషన్, పోలీసు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాం. ఇప్పటికే చెన్నారావుపేట పోలీసులు చేస్తున్న అక్రమ కేసులు, ఆగడాలపై నివేదిక తయారవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదుబీఆర్ఎస్ హయాంలో మంజూరైన బ్రిడ్జిలు, మహిళా భవనాలు, రోడ్ల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించారు. పాకాల వాగు బ్రిడ్జి తిమ్మ రాయనిపహాడ్ బ్రిడ్జి టెండర్లను ఎందుకు పిలవడం లేదని ఎమ్మెల్యే మాధవరెడ్డిని నిలదీశారు. ఇప్పటివరకు పాకాల వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పునాదుల్లోనే ఉందన్నారుచెన్నారావుపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం మంజూరైన రూ. 7.50 కోట్లను ఎందుకు వెనక్కి పంపారని ప్రశ్నించారు. కొత్తగా నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటి వరకు సెంటర్ లైటింగ్ ఎందుకు పెట్టలేదు అన్నారుఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, తీరా గెలిచాక కేవలం వానకాలం సన్న వడ్లకే పరిమితం చేయడం ప్రజలను వంచించడమేనని అన్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ. 28.70 కోట్లు బాకీ ఉన్నారని తెలిపారు ఎన్నికల అధికారులు, పోలీసులు కాంగ్రెస్‌కు వత్తాసు పలికినప్పటికీ, ప్రజలు బీఆర్ఎస్ పైనే నమ్మకంతో ఉన్నారని నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారుఈ కార్యక్రమంలో: మండల పార్టీ అధ్యక్షులు. మండల ఎన్నికల కన్వీన. సొసైటీ చైర్మన్లు. డైరెక్టర్లు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు. మండల ఉపాధ్యక్షులు. కార్యదర్శిలు. సర్పంచ్లు. మాజీ సర్పంచ్లు. ఎంపిటిసిలు. మండల నాయకులు. పార్టీ నాయకులు కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు