
పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. సదరం శిబిరాల నిర్వహణ, యూడీఐడీ తదితర అంశాలపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు డీఆర్డీఓలు, అధికారులతో సెర్ప్ సీఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాల వారీగా సదరం శిబిరాల నిర్వహణ, పెండింగ్ అప్లికేషన్ల వివరాల పై ఆరా తీశారు సెర్ప్ సీఈవో మాట్లాడారు. సదరం శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, దరఖాస్తుదారులకు సమాచారం చేరవేయాలని, వారు ఆబ్సెంట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. భవనాలు, ఫర్నిచర్, ఇతర సౌకర్యాల కోసం నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైన వైద్యులను నియమించు కోవాలని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి వెంటవెంటనే నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు యూడీఐడీ కార్డుల జారీ ఇతర అంశాలపై వివరించారు వీడియో కాన్ఫరెన్స్ లో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పీడీ డీఆర్డీఏ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.