పయనించే సూర్యుడు, అశ్వాపురం 01-01-2026 ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో నూతన పాలకమండలి సమావేశం జరిగినది. పాలకమండలి సభ్యులు తమ తమ వార్డుల్లో సమస్యలను వివరించారు. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెవిటి గూడెం వర్షాకాలంలో చిన్న స్కూల్ ప్రాంతంలో ముంపు కు గురి అవుతున్నది. కావున సమస్యకు పరిష్కారము చూపాలన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన రోడ్లను పూర్తిచేయాలని కోరారు. వీధుల్లో పిచ్చి మొక్కలు ముళ్ళకంప మొదలగు వా.టిని శుభ్రం చేయాలని. గతంలో ఇంటింటికి ట్రాక్టర్ ప్రతిరోజు చెత్తను సేకరించేవారని మళ్లీ అదే మాదిరిగా చేయాలని కోరారు . గ్రామంలో కుక్కల బెడిద తీవ్రంగా ఉందని మీద పడి కరుస్తున్నాయని, గౌతమీ నగర్ కాలనీలో కుక్కల మరియు కోతుల సమస్య తీవ్రంగా ఉందనీ తెలియజేసినారు. సర్పంచ్ సదర్ లాల్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మనకు సేవ చేసే అవకాశం కల్పించారని దానిని మనము చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు అదేవిధంగా పెద్దలు తుళ్లూరి బ్రహ్మయ్య పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ల సహకారంతో అభివృద్ధి చేద్దామని తెలియ చేసినారు గ్రామపంచాయతీ కార్య దర్శి మల్లేష్ మాట్లాడుతూ ఎల్ల వేళల మీకు నా సహకారం అందిస్తానని తెలియా చేశారు. ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు మాట్లాడుతూ మన గ్రామ పంచాయతీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షత వహించారు మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.