పయనించే సూర్యుడు జనవరి 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికలో వాసవిక్లబ్ అధ్యక్షునిగా సమయమంతుల మోహన గంగాధర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పల పవన్, కోశాధికారిగా రావిక్రింది కుమార్ రాజాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ సెంటర్ నేషనల్ 2026 ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిల్వర్‌స్టార్ కెసిజిఎఫ్ పోలిశెట్టి శివకుమార్ పాల్గొని నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సందర్భంగా జిల్లా గవర్నర్ చారుగుళ్ళ శ్రీనివాస్ ఆదేశాలతో జోన్ చైర్‌పర్సన్‌గా జల్లీపల్లి దేవరాజుతో ఈ ప్రమాణం చేయించడమైనది. సత్యవరపు బాలగంగాధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్ప పర్సన్ 2025 బోగవల్లి రాంబాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు కంచర్ల రామారావు, సీమకుర్తి సుబ్బారావు, కొణిజర్ల ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.