ఆకట్టుకున్న ముందస్తు నూతన సంవత్సర వేడుకలు

పయనించే సూర్యడు 01-01-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకారంలో విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో నూతన సంవత్సరంలో విద్యార్థిని విద్యార్థులు కొత్త ఉషస్సులతో కొంగొత్త లక్ష్యాలతో భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని పాఠశాల ప్రిన్సిపల్ బుస సులోచన కరస్పాండెంట్ బుస్సా మహేష్ కోరారు. అనంతరం విద్యార్థులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కోశారు. ప్రతి తరగతిలో విద్యార్థులు కేకులు పంచుకొని పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిరాజ్, రాంబాబు, సైదులు, లక్ష్మీ, భవాని, మల్లికా ,రజియా, సాజిదా, వీర కుమారి ,జ్యోతి, నిశిత, నాగమణి ,విజయ, స్వప్న పాల్గొన్నారు.