ఆదోని జిల్లా లక్ష్యంగా 46వ రోజు ఆటో డ్రైవర్స్ యూనియన్ దీక్షలు

పయనించే సూర్యుడు జనవరి1 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి పశ్చిమ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఆదోనిని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 46వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నేడు సిపిఐ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ టి. వీరేష్ నాయకత్వంలో సిపిఐ అనుబంధ సంఘం ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో జయశంకర్ అయ్యప్ప మంజునాథ్ గిడ్డయ్య నరసన్న హెచ్ మల్లికార్జున ఆచారి బంగార్రాజు జగదీష్ మన్సూర్ కేటాయించి బాబు కూర్చున్నారు జేఏసీ నాయకులు రామయ్య వికలాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ కృష్ణమూర్తి కోదండ దస్తగిరి కుకునూరు వీరేష్ గోపాలచారి పాల్గొన్నారు. మీరు మాట్లాడుతూ.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆదోనిని జిల్లా గా ప్రకటించడం వలన ఆటో కార్మికులకు మాత్రమే కాకుండా వారి భావితరాలకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక లాభాలు చేకూరుతాయని తెలిపారు.ఆదోని జిల్లా కేంద్రంగా మారితే ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా స్థాయి శాఖలు ఏర్పాటు అవుతాయి. దీనివల్ల రోజూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల రాకపోకలు పెరిగి ఆటో కార్మికులకు నిరంతర ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం, కోర్టులు, వైద్య కళాశాలలు, విద్యాసంస్థలు, రవాణా శాఖలు ఏర్పడటంతో ఆటో సేవల అవసరం గణనీయంగా పెరుగుతుంది. జిల్లా కేంద్రంగా మారిన ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు, బస్ స్టాండ్లు, రైల్వే అనుసంధానం, మార్కెట్లు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఆటో కార్మికుల ఆదాయం స్థిరపడటమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలు, బీమా పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ తరాలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించడంతో వలసలు తగ్గి కుటుంబాలు స్థిరంగా జీవించగల పరిస్థితి ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ఆదోని జిల్లా ప్రకటన అనేది కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాకుండా పశ్చిమ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, అప్పటివరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆటో కార్మికులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు, ఆటో కార్మికులు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.