ఆనందం పేరుతో చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ అర్జున్

★ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై అర్జున్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం 01-01-2026 పెనుగంచిప్రోలు మండలంలోని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెనుగంచిప్రోలు మండల ప్రజలకు పెనుగంచిప్రోలు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ సూచించారు. అయితే ఆనందం పేరుతో చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువకులు బైక్ లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, అధికశబ్దాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం బెల్ట్ షాపుల వద్ద మద్యం విక్రయించినా లేదా సేవించినా చట్టపరమైన చర్యలుతీసుకుంటామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని, ఆనందంగా గడపాల్సిన సమయాన్ని పోలీస్ స్టేషన్లో గడపకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించాలని, మీ ఆనందం కోసం ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కే.అర్జున్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యమని తెలిపారు.