
పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /01 :నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :మానకొంర్ నియోజకవర్గం దిగువ మానేరు డ్యామ్ నుండి కాకతీయ కాలవకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీరు విడుదల చేశారు. బుధవారం ఎల్ఎండీ హెడ్ రెగ్యులేటర్ వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్సారెస్పీ అధికారులతో కలిసి ఆయన స్విచ్ఛాన్ చేసి నీటి కాలువలోకి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యామ్ కింద గల సాగులో ఉన్న ఆయకట్టు రబీ(యాసంగి) పంటలకు సాగునీరందించాలనే ఉద్దేశంతోనే కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 3,04,875 ఎకరాల్లో ఐడీ పంటలు, 3,85,820 ఎకరాల్లో తడి పంటలు వెరసి 6,90,695 ఎకరాల ఆయకట్టుకు 45.175 టీఎంసీల నీటి అవసరమని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి మార్చి మాసాంతం వరకు ప్రతి రోజు 5000క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తామన్నారు. ఎల్ఎండీ నుంచి విడుదల చేస్తున్న నీరు మూడు జోన్లలో పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందుతుందన్నారు. 1వ జోన్ పరిధిలో కరీనగర్ నుంచి మానకొండూర్, హుజూరాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్థన్నపేట మండల్లోని 3,51,541 ఎకరాలకు, 2వ జోన్ పరిధిలో వర్థన్నపేట నుంచి పాలకుర్తి, డోర్నకల్, పాలేరు, మధిర, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ మండలాల్లో 3,39,154 ఎకరాలకు నీరందుతుందని ఎమ్మెల్యే వివరించారు. సమానంగా నీటి పంపిణీ కోసం ఆన్ , ఆఫ్ విధానం ద్వారా ఆరు తడులకు 90 రోజులపాటు నీరందిస్తామని ఆయన చెప్పారు. కాకతీయ కాలువ ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ పర్యవేక్షక ఇంజినీర్ పి.రమేశ్, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఈ.సదయ్య, సంజన, కిరణ్ కుమార్, డీఈ డి.శ్రీనివాస్, ఏఈలు వంశీధర్, వెంకటేశ్, తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి,గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, సమద్, నాగిశెట్టి రాజయ్య, దూలం వీరస్వామి, వాల అంజుత్ రావు, ఎల్లారెడ్డి, బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.