ఈ.కే.పేట తండాలో వీధి దీపాల ఏర్పాటు

పయనించే సూర్యడు 01-01-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ఈ.కే.పేట తండాలో గ్రామ ప్రజల సౌకర్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించబడింది. రాత్రి వేళల్లో గ్రామ ప్రజలు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు ఈ దీపాలు ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ వరలక్ష్మి (వెంకట రమణ), ఉపసర్పంచ్ బానోతు ప్రమీల, వార్డు సభ్యులు ధారావత్ అమ్రు, మాధర్, కౌసల్యతో పాటు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గం మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు వల్ల గ్రామంలో భద్రత మెరుగుపడి, రాత్రి సమయంలో ప్రమాదాలు తగ్గుతాయని గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.