ఉద్యోగ విరమణ పొందిన జి.ఎం కు ఆత్మీయ సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్( పెద్దపల్లి జిల్లా) సెంటినా సెంటినరికాలనీ జనవరి-01:- అడ్రియాల లాంగ్ వాల్ గని ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉద్యోగ విరమణ పొందిన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు లను అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, ఇతర అధికారులు కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జి.యం ఏ.పి.ఏ మాట్లాడుతూ నరేంద్ర సుధాకరరావు సింగరేణి సంస్థలో 40 సంవత్సరాల పాటు వివిధ ఏరియాలలో, వివిధ గనులు, విభాగాలలో, వివిధ హోదాలలో విధేయతతో, అంకితభావంతో అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు.పలు సంస్కరణలు చేపట్టి ఉన్నతాధికారుల మన్ననలు పొందారన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్వోటుజిఎం బండి సత్య నారాయణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ రఘురామ్, మేనేజర్ పెంచలయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *