ఉద్యోగ విరమణ పొందిన రామగుండం-3 జి.ఎం నరేంద్ర సుధాకర రావు కు ఆత్మీయ సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ : (పెద్దపల్లి జిల్లా) సెంటినరీ కాలనీ, జనవరి-01:- జి.ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉద్యోగ విరమణ పొందిన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు లను అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, ఏరియాలోని వివిధ గనులు, విభాగాధిపతులతో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జి.యం ఏ.పి.ఏ మాట్లాడుతూ నరేంద్ర సుధాకరరావు సింగరేణి సంస్థలో 40 సంవత్సరాల 2 నెలల పాటు వివిధ ఏరియాలలో, వివిధ గనులు, విభాగాలలో, వివిధ హోదాలలో విధేయతతో, అంకితభావంతో అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. పలు సంస్కరణలు చేపట్టి ఉన్నతాధికారుల మన్ననలు పొందారన్నారు. రామగుండం-3 ఏరియా జీవిత కాలం పెరగడానికి వారు చేసిన కృషి ఎనలేదని, ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ పొందిన ఆర్.జి-3 జి.యం మాట్లాడుతూ ఏరియాలో జిఎం కార్యాలయం ఎంతో కీలకమని, ఇక్కడ తీసుకునే నిర్ణయాల వలన గనులలో పనులు త్వరత గతిన పూర్తవుతాయని, మీ అందరి సహకారంతో రెండున్నర సంవత్సరాలు ఏరియా లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించానని, అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఎస్వోటుజిఎంలు యం. రామ్మోహన్, బండి సత్య నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, విభాగాధిపతులు బి.సుదర్శనం, సివిల్ డీజిఎం- రాజేంద్ర కుమార్, మురళి కృష్ణ, రాజారెడ్డి, జనార్ధనరెడ్డి , సి.జె.సురేఖ, రాజేశ్వరి, ఐలయ్య, రవి చరణ్, షబ్బీరుద్దీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.