పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ 01-01-2026 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామంలో బుధవారం 15వ సామాజిక తనిఖీ ఉపాధి హామీ గ్రామ సభను గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. గ్రామంలో 470 జాబ్‌కార్డులు ఉండగా, 260 మంది కూలీలకు రూ.23 లక్షల పైచిలుకు వేతనాలు జమ కాగా, మెటీరియల్ రూపకంలో రూ.1.16 లక్షల ఖర్చు జరిగినట్ల ఆర్ పి రమ్య తెలిపారు. గ్రామంలోని రోడ్ల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు, పెండింగ్ టాయిలెట్ నిధుల మంజూరు, పోరుమాళ్ళ–మహితాపూర్ పెద్దవాగు శుభ్రపరిచే పనులు, ఎస్సారెస్పీ కెనాల్ క్లీనింగ్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు రెండు అదనపు గదులు, ప్రైమరీ స్కూల్ వద్ద ప్రహరీ గోడ, టాయిలెట్ల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ తలారి నాగమణి, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్, వార్డు సభ్యులు అనుమల్ల రమ, కొల్లా ప్రమీల, నేమిళ్ల లత, బొమ్మేనా లక్ష్మి, బుస గంగ మల్లయ్య, లింగంపెల్లి లక్ష్మణ్, సద్ది సంగీత, బత్తిని శ్రీనివాస్, భూపెల్లి పరమేష్ కలిసి డి ఆర్ డి ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, అనుమల్ల సత్యనారాయణ, కొల్లా నారాయణ, స్వామిరెడ్డి, వేణు, సాయి, లక్ష్మణ్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినరాణి, పంచాయతీ కార్యదర్శి తోగిటి వేణు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, మేట్ బొమ్మేన తేజ, కవితతో పాటు ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు,సిబ్బంది పాల్గొన్నారు.