పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 66 డివిజన్ల ఓటర్ జాబితా కు సంబంధించిన ఆన్ లైన్ ఈ మ్యాపింగ్ ప్రక్రియను తనిఖీ చేసి పరిశీలించారు ఈ పోర్టల్ లో ఓటర్ల డేటాను పొందుపరుస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించి అధికారులు కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది కి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబిజా తయారీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు ఇచ్చిన డేటాలో డివిజన్ల వారిగా పోలింగ్ బూత్ ప్రకారం ఓటర్ల డాటాను పొందు పరచాలని మ్యాపింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సక్రమంగా జాబితాను రూపొందించాలని ఆదేశించారు ప్రతి ఓటర్ డేటాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఈ మ్యాపింగ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్ టౌన్ ప్లానింగ్ ఏసీపిలు వేణు శ్రీధర్ టిపిఎస్ లు తేజస్ ని సంసంధ్య టీపిబివో లు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు