పయనించేసూర్యుడు, జనవరి1 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ప్రశ్నిస్తే ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన రౌడీషీటా? విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై ఓపెన్ చేసిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలి,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన ఉద్యమాలు అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన విశాఖపట్నంలో రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ హోటల్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష, పట్టణ కార్యదర్శి దస్తగిరి లు మాట్లాడుతూ విద్యార్థులకు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపైన ఉద్యమాలకు సంబంధించిన పాత కేసులు తోడి నేడు విశాఖపట్నంలో ఐదు మంది విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ఖండించారు తక్షణమే ఓపెన్ చేసిన రౌడీషీట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రితో సహా చాలామంది పైన పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి వాటి ఆధారంగా వారి పైన రౌడీషీట్ ఓపెన్ చేస్తారా ఐజి గారు. విద్యార్థులకు యువజనలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే,పాత కేసులు తోడి నేడు విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీషీట్ ఓపెన్ చేయడాని ఖండించారు.గత రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం బైజు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆందోళన చేసిన నాయకుల పైన అప్పటి ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది, నేడు రెండు సంవత్సరాల తర్వాత పాత కేసులు అన్నీ తోడి విద్యార్థి యువజన నాయకుల పైన విశాఖపట్నంలో రౌడీషీట్ ఓపెన్ చేశారని మండిపడ్డారు. వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన నాయకుల పైన తప్పుడు కేసులు బనాయిస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పెట్టేటువంటి కేసులు తొలగిస్తామని అనేక సభలలో సమావేశాలలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో విద్యార్థులకు యువజనలకు ఉపాధ్యాయులకు కార్మికులకు ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక సంఘాలకు హామీలు ఇచ్చారు నేడే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్లను అణిచివేయాలని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి వారు ఎవరు ఉండకూడదనేటువంటి నెపంతో రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఒక హిట్లర్ పరిపాలనను తలపిస్తూ రౌడీ షీట్లు పీడీ యాక్ట్లు ఓపెన్ చేసి ఉద్యమాలను అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు, దేశ చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నిలిచినటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు మేమేమీ మర్డర్లో మానభంగాలో రేపులో చేయలేదు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుల పైన మీ ప్రభుత్వం రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఇంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ల మీద నువ్వు రౌడీషీట్ ఓపెన్ చేసావా ఏ రోజైనా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి కైతే ఒక రూలు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన నాయకులకు ఒక రూల..విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపైన పెట్టిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ పట్టణ కోశాధికారి శేఖర్, పట్టణ నాయకులు వీరేష్, కృపారాజ్, బాబావాలి, శివ, మోహన్ తదితరులు పాల్గొన్నారు