పయనించే సూర్యుడు న్యూస్ : 01-01-2026, తల్లాడ రిపోర్టర్ మండలంలోని మల్లారం గ్రామంలో కీర్తిశేషులు కటికి మోహన్ రావు వద్దంతి వేడుకలను కుమారులు మల్లారం గ్రామపంచాయతీ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, సీతారామయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. కీర్తిశేషులు కటికి మోహన్ రావు చిన్ననాటి నుంచి, కాలేజీ స్థాయిలోనే నాయకుడిగా ఉండి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నీటి సంఘం సంఘం అధ్యక్షుడిగా ఎన్ఎస్పి కాలువల ఆధునికరణ పనులు నిస్వార్ధంగా నాణ్యత పరిణామాలతో పనులు నిర్వహించి రైతులకు సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తు చేస్తూ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.