పయానించే సూర్యుడు, జనవరి 01 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. పద్మనాభ తీర్థ గెస్ట్ హౌస్ లో మాజీ డిజిపి ప్రస్తుత ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావును కలిసిన మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు వాల్మీకి బీవీ రవిచంద్ర . ఇద్దరు కలిసి శాలువతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ గురించి సమస్యలను ఆయనకు తెలిపారు. యాత్రికులు ఎక్కువ అయినందున ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునికరించవలసిన అవసరం ఉందన్నారు. దానికి మాజీ డిజిపి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, ఆర్టీసీ డిఎం మద్దిలేటి ఇంకా అఫీషియల్సు పాల్గొన్నారు.
