పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- కుల వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ రాజేష్ పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో బుధవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో తహసిల్దార్ రాజేష్ చర్చించారు.. ఈ కార్యక్రమంలో కొప్పూర్ గ్రామ సర్పంచ్ కుమారస్వామి, ఆర్ఐ శ్రీధర్, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..